ఇమ్మానుయేలైన నా దేవుడు – Song lyrics

పల్లవి: ఇమ్మానుయేలైన… నాదేవుడు నన్నుకాపాడువాడు
నాకోట నాశైలము నాదుర్గమై నన్ను రక్షించువాడు.

అ.ప : నేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా…
నాకాపరి నాఊపిరి నాసర్వం నాయేసెగా..

1. గాఢాంధకారపు లోయలలో – నేను సంచరించిన
శత్రృవుల చేతిలో నేఓడిన – శోధనలే చుట్టుముట్టిన
నేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా..
నా కాపరి నాఊపిరి నాసర్వం నాయేసెగా ! ఇమ్మాను!

2. దిక్కులేనివానిగ నేనుండిన – ఈలోకమే వెలివేసిన….
నమ్మినహితులెల్ల ద్వేషించిన – అవమానములే చేసిన
చింతించనూ దుఃఖించనూ నీస్నేహమేవుండగా…
నాఆశ్రయం నాకేడెము నాబలము నాయేసెగా !ఇమ్మాను!

రచన & స్వరకల్పన
సురేష్ నిట్టల(సింగపూర్)

Leave a Comment